Foundation Vedanta Course Telugu
- Description
- Curriculum
- Reviews

అనాదియైన వేదాంతవిజ్ఞానం నిక్షిప్తమై ఉన్న పెట్టె తాళాలను తెరవండి!
CIFవారి ఈ “ప్రాథమిక వేదాంత” కోర్సు మనయొక్క “అసలైన స్వరూపాన్ని” వెలికితీయడంకోసం సహాయకారిగా అద్వైతవేదాంతబోధలను పరిచయం చేయడానికి ప్రవేశపెట్టబడింది. ఆధ్యాత్మికాన్వేషులకు, వేదాంతం నేర్చుకునే విద్యార్థులకు, అంతేగాకుండా జీవితంలోని గాఢమైన సత్యాలను అర్థం చేసుకుని, వాటిని దైనందినజీవితంలో వినియోగించుకోవాలనే ఆసక్తి కలిగినవారికి ఈ కోర్సు ఒక ఆపురూపమైన అవకాశాన్ని కలుగజేస్తుంది.
వేదాంతాన్ని ఎందుకు నేర్చుకోవాలి?
వేదాల సారమైన వేదాంతం “ఆత్మ స్వరూపం, ప్రపంచం, శాశ్వతమైన అంతిమసత్యం”వంటి అంశాలకు సంబంధించి అనాదిగా లభిస్తూ ఉన్న విజ్ఞతను మనకు ప్రసాదిస్తుంది.
వేదాంతాన్ని పఠించడం ద్వారా –
- జీవితంయొక్క లక్ష్యాన్ని, పరమానందప్రాప్తిని సాధించడానికి కావలసిన అంతర్దృష్టి మీలో ఏర్పడగలదు.
- ‘శాంతి, స్పష్టత, సాఫల్యం’ – వీటితో మీరు బ్రతకడమనే “జీవనకళ”ను మీరు కనుగొనగలరు.
- ‘అంతర్గతదార్ఢ్యం, స్వీయక్రమశిక్షణ, ఆధ్యాత్మిక విజ్ఞత’వంటివాటిని మీరు అలవరచుకోగలరు.
ఈ కోర్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు
క్రమబద్ధీకరించబడిన పాఠ్యాంశాలు:
ప్రాథమిక వేదాంతానికి సంబంధించినవైన స్వామి చిన్మయానంద గారి రచనలు – “Kindle Life, Art of Man-making, A Manual of Self Unfoldment, Meditation & Life, Art of Contemplation”; స్వామి తేజోమయానంద గారి రచనలు – “Hindu Culture, Meditation – A Vision” – వీటిలోని ముఖ్యాంశాలు
ఈ కోర్సులో పొందుపరచబడ్డాయి.
వేదాంతంలో చాలా ముఖ్యాంశాలైన “ఆత్మ (the Self), బ్రహ్మము (the Absolute), మాయ (illusion), మోక్షము (liberation)” వంటి అంశాలపైన లోతైన అవగాహనను (in-depth understanding) ఈ పుస్తకాలు కలిగిస్తాయి.
మార్గదర్శకమైన పద్ధతిలో నేర్పడం: ప్రతి పాఠం తగిన వ్యాఖ్యానాలతో, విశదీకరణతో ప్రణాళికాబద్ధంగా – అనుభవజ్ఞులైన అన్వేషులకు, క్రొత్తగా నేర్చుకునే వారికి కూడా సంక్లిష్టమైన అంశాలపై ఒకే రీతిలో అవగాహన కలిగే విధంగా ఏర్పరచబడింది.
మీ మీ వెసులుబాటుకు అనుగుణంగా నేర్చుకోవడం: మీ సౌకర్యాన్నిబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా నేర్చుకుంటూ పూర్తిచేసుకునేటందుకు అవకాశం ఉండే విధంగా ఈ కోర్సు రూపొందించబడింది.
నైపుణ్యం కలిగిన మార్గదర్శకత్వం: లోతైన అవగాహన, ఆధ్యాత్మికరంగంలో ఎంతో అనుభవం. కలిగిన దోహదకారుల (experienced facilitators) ఆధ్వర్యంలో ఈ కోర్సు నిర్వహించబడుతున్నది. దీనిద్వారా ఈ కోర్సు మొత్తం వ్యవధి పూర్తయేసరికి మీ ఆధ్యాత్మికయాత్రకు కావలసిన అవగాహన విషయమై మీ అంతర్దృష్టి పెంపొందగలదు.
ఆచరణాత్మకం కూడా: ఈ కోర్సులో బోధించబడే విషయాలన్నీ కేవలం సిద్ధాంతపరమైనవి మాత్రమే కావు! నిత్యజీవితంలో ఆ వేదాంతవిజ్ఞానం మీకు ఎంతగానో ఉపకరిస్తుంది; ఆధ్యాత్మికోన్నతికి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ విజ్ఞత ఎంతగానో దోహదపడుతుంది.
నమోదుచేసుకోవడానికి ఎవరెవరు అర్హులు?
ఈ కోర్సు ఎవరికి ఉపయుక్తమంటే –
- ఆధ్యాత్మికాన్వేషులకు: జీవితానికి గల లక్ష్యాన్ని అర్థంచేసుకుని, స్వీయసాక్షాత్కారం కోసం కావలసిన మార్గాన్ని అన్వేషించాలనే తపన ఉన్న ఎవరికైనా సరే!
- వేదాంతవిద్యార్థులకు: వేదాంతం మనకు అందించే అమూల్యమైన, అపారమైన ఆధ్యాత్మికసంప్రదాయాలపై ఆసక్తి ఉన్నవారికి
- ‘యోగ, ధ్యాన’ సాధకులకు: శాస్త్రసమ్మతమైన అంశాలను బాగా అర్థంచేసుకోవడం ద్వారా ఈ ప్రక్రియలలో తమ సాధనను పెంపొందించుకోవాలని కోరుకునే వ్యక్తులకు
- వ్యక్తిత్వవికాసాన్ని అభిలషించే ఏ వ్యక్తికైనా: ‘వ్యక్తిత్వంలో మెరుగుదల, అంతర్గతప్రశాంతత, భావోద్వేగాల అదుపు’ మొదలైనవాటిని సాధించడానికి అవసరమైన ఉపకరణాలను, పద్ధతులను వేదాంతం సూచిస్తుంది.
కోర్సు నమూనా
- కాలపరిమితి: మీ వెసులుబాటుకు అనుగుణంగా కాలపరిమితిని మీరే నిర్ణయించుకోవచ్చు.
- మాధ్యమం: ఆన్లైన్ (ఏ పరికరానికైనా అందుబాటులో)
- వనరులు: సమగ్రంగా రూపొందించబడిన “చదువుకోవలసిన పాఠాలు మొ/ సమాచారం”, వీడియోలద్వారా ప్రసంగాలు, లక్ష్యసంబంధితమైన ప్రశ్నాపూర్వక-వినోదం (quizzes)
- అధికారికపత్రం: కోర్సు సమర్థవంతంగా పూర్తయ్యాక, చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి “మీరు విజయవంతంగా కోర్సును పూర్తి చేసినట్లుగా” ఒక అధికారికపత్రం (certificate) మీకు లభిస్తుంది.
ఈరోజే మీ పేరు నమోదు చేసుకోండి!
“మీ స్వభావాన్ని మెరుగుపరచుకునే ఆధ్యాత్మికయాత్రను” చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి “ప్రాథమికవేదాంత” కోర్సుతో ఆరంభించి, వేదాంతంలోని కాలాతీతమైన విజ్ఞతను పోను పోను అనుభవంలోకి తెచ్చుకోండి.
ఇంతవరకూ మీకు ఆధ్యాత్మికవిద్యతో పరిచయం లేకపోయినా, మీరు ఇప్పటికే అనుభవాన్ని గడించిన సాధకులైనా – ఈ కోర్సు సహాయంతో మీకు ‘శాశ్వతసత్యంయొక్క స్వభావం, స్వీయావిష్కరణ’ – వీటి విషయమై అమూల్యమైన అంతర్దృష్టి ఏర్పడి తీరుతుంది.
మరిన్ని వివరాలకు, సందేహనివృత్తికి క్రింది చిరునామాతో సంప్రదించండి:
The Administrator – Home Study Courses
Chinmaya International Foundation, Adi Sankara Nilayam,
Veliyanad, Ernakulam District,
Pin – 682313, Kerala, India.
కోర్సు వివరాలు
- కోర్సు పరిమాణం: మొత్తం 24 పాఠాలు (నెలకు 2 పాఠాలు చొప్పున); వీటికి జోడింపుగా వీడియోల్లో రికార్డు చేయబడిన మార్గదర్శనాత్మకమైన సమావేశాలు & రెండేసి పాఠాలకు ఒక్కొక్కటి చొప్పున 12 లక్ష్యాత్మక (objective type – 4 సమాధానాలు నుండి సరియైనదానిని ఎన్నుకోవడం వంటివి) ప్రశ్నావళులు (questionnaires) ఉంటాయి.
- ఈ కోర్సు సుమారు ఒక సంవత్సరం పాటు ఉండే విధంగా అంచనా వేయబడింది. అయితే, ఏ విద్యార్థియైనా దీనిని ఇంకా వేగవంతంగా ముగించుకుని, ఒక సంవత్సరం లోపుగానే పూర్తిచేసుకోగలిగే అవకాశం కూడా ఉన్నది.
- విద్యార్థుల కోసం వారం వారం నిర్వహించే ఊతపు కార్యక్రమాల్లో (assistance programmes) పాల్గొనడానికి సహాయపూర్వక-మార్గదర్శక సమావేశాల (mentor sessions) సదుపాయాన్ని మీరు వినియోగించుకోవచ్చు.
ఏ విధంగా నమోదు చేసుకుని మీరు ఈ కోర్సులో కొనసాగవచ్చు?
- మీరు నేరుగా మా వెబ్ సైట్ ద్వారా మీ పేరును నమోదు చేసుకోవచ్చు. మాకు మీరు కట్టిన రుసుము అందిన వెంటనే మీ నమోదు ఈ కోర్సుకై పనిచేయడం మొదలౌతుంది (activated).
- వెబ్ సైట్ లోకి లాగిన్ అయి, “ఎన్రోల్ అయిన కోర్సులు & ఆల్బమ్ విభాగం (Enrolled Courses & Album section)”నుండి ‘మీకు సంబంధించిన కోర్సు’వద్దకు వెళ్ళవచ్చు.
- “చదువుకోవడంకోసం మీవద్ద ఉన్న పాఠ్యాంశ-సంబంధితసమాచారాన్ని ఉపయోగించుకుంటూ” ప్రతీ పాఠాన్నీ చదివి, ఆకళించుకొండి.
- సంబంధితపాఠం యొక్క వీడియో రికార్డింగ్ ను కూడా పరిశీలించండి.
కోర్సు అంచనా (మూల్యాంకనం):
- మీ సమాధానాలను ‘Start Quiz’ అనే కిటికీ ఎంపిక ద్వారా అందజేయండి.
- మీకు ఇవ్వబడే ప్రశ్నలన్నీ లక్ష్యాత్మకంగానే (objective) ఉంటాయి; వాటంతట అవే వ్యవస్థాక్రమాన్ని అనుసరించి, అక్కడికక్కడే మూల్యాంకనంచేయబడతాయి (autograded by the system).
- ఆన్లైన్లో మీరు ఒక ప్రశ్నాపత్రాన్ని పూర్తిచేసి అందజేయగానే, తరువాత నేర్చుకోవాల్సిన పాఠాల దొంతర (set) దానంతట అదే మీకు అందుబాటులోకి వస్తుంది.
- కోర్సును విజయవంతంగా పూర్తిచేసినవారికి కోర్సును పూర్తిచేసినట్లుగా ‘ప్రపంచవ్యాప్త చిన్మయ మిషన్ అధిపతి’యైన పూజ్య శ్రీ స్వామి స్వరూపానంద గారి సంతకంతో ఒక ‘అధికారిక పత్రం’ (Course Completion Certificate)” మీకు లభిస్తుంది. అంతేగాక, రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా ఈ అధికారిక పత్రపు డిజిటల్ కాపీ కూడా మీకు పంపబడుతుంది.
- అధికారిక పత్రంలో సూచించబడే శ్రేణీకరణావిధానం (grading system) క్రింది పద్ధతిని అనుసరించి ఉంటుంది:
- 80% & ఆపైన – Grade ‘O’
- 60% & ఆపైన – Grade ‘A+’
- 50% & ఆపైన – Grade ‘A’
- 50%కు దిగువన – Grade ‘B’
Inclusive of 18% GST